మహరాష్ట్ర సిఎం ప్రమాణ స్వీకారోత్సవంలో  చంద్రబాబు 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం మహరాష్ట్రకు చేరుకున్నారు.  సాయంత్రం ముంబైలో మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబుతో సహా ఎన్ డి ఎ భాగస్వామ్య పక్షాలు హాజరుకానున్నాయి. మహారాష్ట్ర సిఎంగా ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  మధ్యాహ్నం గుంటూరు జిల్లా ఉండ వల్లి నుంచి చంద్రబాబు ప్రత్యేక హెలిపాడ్ లో విజయవాడ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి మహరాష్ట్రలోని ఛత్రపతి  ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్  నుంచి నేరుగా  ముంబయిలోని ప్రమాణ  స్వీకారస్థలికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత చంద్రబాబు వైజాగ్ చేరుకుంటారు.