కుక్కల దాడి... క్రిందపడి 4 ఏళ్ల పాప మృతి
posted on Jul 11, 2025 6:27PM

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో క్రిందపడి చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామంలో జయరాముడు, రామేశ్వరి దంపతులకు కూతురు మధుప్రియ ( 4 సంవత్సరాల) పై వీధి కుక్కలు గుంపు ఒకసారిగా దాడి చేయడం జరిగింది. తీవ్ర భయాందోళనకు గురైన పాప పరుగులు పెడుతూ కింద పడింది.వెంటనే గమనించిన స్థానికులు కుక్కలను తరిమి పాపను రక్షించారు. అప్పటికే సృహ కోల్పోయిన పాపను బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తీసుకొని వెళ్లడం జరిగింది.ఆస్పత్రి నందు చికిత్స పొందుతూ పాప మృతి చెందింది.
బాదిత బంధువులు మీడియాతో మాట్లాడుతూ... గ్రామంలోని ఎస్సీ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం వల్ల భయాందోళనకు గురవుతున్నామన్నారు. నంద్యాల, బనగానపల్లె వైపు వెళ్లే ద్విచక్ర వాహనాలపై కుక్కలు దాడికి చేస్తున్నాయన్నారు.బాధిత కుటుంబం మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు.అదేవిధంగా ప్రధాన రహదారిపై ఉన్న స్కూల్ ఎదుట స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నామని రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయించాలని అధికారులను గ్రామస్తులు కోరుకుంటున్నారు.