సిర్గాపూర్ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్
posted on Jan 3, 2026 9:32AM
.webp)
విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా, అన్నంలో విషం పెట్టి వారిని చంపేయాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ ను సస్సెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. సిర్గాపూర్ ఎస్సీ బీలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి వేధిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం (జనవరి 1) రాత్రి కడ్పల్, సిర్గాపూర్ రహదారిపై బైఠాయించారు. దీంతో అధికారులు హాస్టల్ కు వచ్చి విచారణ జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్ కిషన్ నాయక్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దీంతో విద్యార్థులపై కక్ష పెంచుకున్న వార్డెన్ శుక్రవారం (జనవరి 2) పూటుగా మద్యం సేవించి హాస్టల్ కు వచ్చి విద్యార్థులను దుర్భాషలాడారు. హాస్ల్ సిబ్బందికి పోన్ చేసి తన మీద ఫిర్యాదు చేసిన విద్యార్థులకు అన్నంలో విషం కలిపి చంపేయమంటూ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కిషన్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.