సానియా మిర్జా తెలంగాణకి గర్వకారణం: కేసీఆర్
posted on Jul 22, 2014 2:23PM
.jpg)
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి, ప్రయోజనాలను సానియా మిర్జా ప్రమోట్ చేయనుంది. ఇప్పటి వరకు టెన్నిస్ క్రీడాకారిణిగా, మోడల్ కనిపించిన సానియా మీర్జా తెలంగాణ అంబాసిడర్‌గా కొత్త పాత్రలో కనిపించనుంది. సానియా మిర్జాను తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్టు ఐఎఎస్ అధికారి జయేశ్ రాజన్ ధ్రువీకరించారు. మంగళవారం జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో సానియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ అధికార ధ్రువీకరణ పత్రంతోపాటుకోటి రూపాయల చెక్ అందించారు. సానియా అసలు సిసలైన హైదరాబాదీ కావడం తెలంగాణకు గర్వకారణం అని కేసీఆర్ అన్నారు.