ధాన్యం కొనకుంటే రైతు బంధు ఎందుకు? కేసీఆర్ ను నిలదీసిన రేవంత్ రెడ్డి 

వరి ధాన్యం కొనుగోలుపై  టీఆర్ఎస్, బీజేపీ  కలిసి నాటాకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం తన రైతు వ్యతిరేక బుద్ధిని మరోసారి చాటుకుందన్నారు. రైతుల సంక్షేమం గురించి కేసీఆర్‌ ఎందుకు ఆలోచించడం లేదని రేవంత్‌ మండిపడ్డారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని రేవంత్‌ ప్రశ్నించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా దిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు.

750 మంది రైతుల చావుకు కారణం మోడీ ప్రభుత్వం అన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీతో కుమ్మక్కై  టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరాడుతామంటున్న టీఆర్ఎస్ ఎంపీలంతా సభకు ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  రైతుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం ధాన్యం కొనలేదా? ధాన్యం కొనలేకపోతే వేల కోట్ల ప్రాజెక్టులెందుకు, రైతుబంధు ఎందుకు? అని నిలదీశారు. వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదన్నారు రేవంత్ రెడ్డి. 

దళిత బంధు అటకెక్కినట్టేనా ? కేబినెట్ సమావేశంలో చర్చే లేదా? 

పసుపు బోర్డుపై నిజామాబాద్‌ రైతులను బీజేపీ మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ చక్కెర పరిశ్రమలను మూసివేసి రైతులకు నష్టం చేశారని ఆరోపించారు. రైతులకు రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందట్లేదన్నారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే తోటలు, మెట్ట పంటలు లేకుండా పోయాయని పీసీసీ చీఫ్ విమర్శించారు. ఏ పంటను కొనకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?'' అని రేవంత్‌ రెడ్డి  ప్రశ్నించారు.