మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా? జగన్ కు తిరుగుబాటు భయమా ? 

డిసెంబర్ 6..కు ఒక ప్రత్యేకత వుంది. అందుకే ఆరోజు కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అవును,ఆ రోజుతో ఆంధ్ర ప్రదేశ్’లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు  పూర్తవుతాయి.  సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది. 

వైసీపీ అదికారంలోకి వచ్చినా,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక విచిత్ర నిర్ణయంతో, కొద్ది మంది మినహా సీనియర్లకు అయన మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు.ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నా అందులో అనుభవం ఉన్న వారు ఒకక్రు లేరు. అలాగే మంత్రుల్లోనూ ఇకరిద్దరిని మినహాయిస్తే, ఎవరికీ పరిపాలన అనుభవం లేదు. అనుభవరాహిత్యంతో జరగ వలసిన అనర్ధాలు అనేకం జరిగి పోయాయి.  రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి అప్పుడే మాటిచ్చారు. ఇప్పుడు ఆ రెండున్నరేళ్ళ గడవు, డిసెంబర్ 6 తో ముగుస్తుంది. సో .. ఆశావహులు అంతా ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  

అయితే, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఉండక పోవచ్చని, విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక దశలో ముఖ్యమంత్రి, మొత్తానికి మొత్తంగానే మంత్రి వర్గాన్ని కట్టకట్టేస్తారని, పక్షాలన పూర్తి స్థాయిలో ఉంటుందని , పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి మనసు మారిందని అదే పార్టీ  వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మరో ఆరు నెలలు వాయిదా’ అన్న వార్త పార్టీ వర్గాల్లో షికార్లు చేస్తోంది. సో.. ఇప్పట్లో ఆశావహులకు తీపి కబురు అందే అవకాశం లేదని తెలుస్తోంది. 

ఆర్థిక పతనం మొదలైందా..? ఏపీలో ఎమర్జెన్సీ తప్పదా? 

మంత్రివర్గ మధ్యంతర పక్షాలన వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరున ఇటు మంత్రులను, అటు ఆశవహులను కంట్రోల్లో పెట్టుకోవడం కోసమే, మంత్రివర్గ పునర్వ్యవ్యవస్థీకరణ అస్త్రాన్ని అప్పుడప్పుడు బయటకు తీస్తుంటారని అంటున్నారు. మంత్రివర్గంలో అందరినీ మార్చి, కొత్త వారిని నియమిస్తారని... జగన్‌ సన్నిహిత బంధువైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గతంలో ధ్రువీకరించారు. ఇంకొందరు సీనియర్లు మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి అభీష్టమని వ్యాఖ్యానించారు.
అయితే నిధుల లేమి, కరోనా కారణంగా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే రెండున్నరేళ్లు గడచిపోయాయన్న అభిప్రాయం మంత్రుల్లో నెలకొంది. కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన నేతను ఆశ్రయించి... కనీసం మరో ఆరు నెలలయినా తమను కొనసాగించేలా చూడాలని కోరారన్న ప్రచారం జరుగుతుంది. 

జస్టిస్ కనగరాజ్‌కు మళ్లీ పదవి.. మూడో పోస్టు అయినా ఉంటుందా?

మరో వంక ముఖ్యమంత్రి కూడా ఒక్కసారిగా కాకుండా,అంచెల వారీగా, ఏరివేతలు, అదేసమయంలో కొత్త వారికి అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే,  అసమ్మతిని అదుపులో ఉంచుకోవచ్చన్న వ్యూహంలో అంచలవారీ విస్తరణ వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.