కన్నడనాట పార్టీలను జాగ్రత్తపరచిన స్ట్రింగ్..!

రాజ్యసభ నోటీఫికేషన్ వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మించిన రాజకీయాలు నడుస్తున్నాయి కన్నడ నాట. అయితే చివరి నిమిషంలో ఆంధ్ర రాజకీయ పార్టీలు కాస్త తగ్గడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అటు కర్ణాటకలో మాత్రం ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీల బలాబలాల రీత్యా కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరపున ఆస్కార్ ఫెర్నాండేజ్, జైరాం రమేశ్, కేసీ రామమూర్తి, బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, జేడీఎస్ తరపున బీఎస్ ఫరూఖ్ నామినేషన్లు వేశారు. ఉన్న స్థానాల కంటే పోటీ చేసేవారు ఎక్కువ కావడంతో పోలింగ్ తప్పనిసరైంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకునేందుకు ఎంత కావాలంటే అంత చెల్లించేందుకు వెనుకాడటం లేదు.

 

అటు  ఎమ్మెల్యేలు కూడా రూ.5 కోట్లు ఇస్తామంటే చెప్పండి..మా ఓటు మీకే అంటున్నారు. ఒక టీవీ ఛానెల్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలు మల్లిఖార్జున ఖూబా, జీటీ దేవేగౌడ, కర్ణాటక జనతా పార్టీ ఎమ్మెల్యే బీఆర్‌పాటిల్‌ను కలవగా..వారు ఒక్కో ఓటుకు రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు డిమాండ్ చేసిన వీడియో లీకైంది. ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డబ్బు కోసం ఎమ్మెల్యేలు ఆశపడే అవకాశం ఉండటంతో దీంతో వివిధ పార్టీలు తమ తమ ఎమ్మెల్యేలను జాగ్రత్త పరచుకుంటున్నారు. దాంతో పాటు ఇటు అధికార కాంగ్రెస్‌కు గానీ, అటు ప్రతిపక్ష జేడీఎస్‌కు గానీ అదనపు స్థానం గెలుచుకోవడంలో కీలకంగా మారిన 14 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ముంబైకి తరలించినట్టు తెలుస్తోంది. వారందరిని కమ్యూనికేషన్‌కు దూరంగా ఓ ఆజ్ఞాత ప్రదేశంలో ఉంచినట్టు సమాచారం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu