పుతిన్ భారత పర్యటన.. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ బంధాలు మరింత బలోపేతం!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. పుతిన్ రెండు రోజుల భారత పర్యటన గురువారం (డిసెంబర్ 4)న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో పుతిన్, మోడీల మధ్య కీలక చర్చలు జరగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా వాణిజ్యం,  వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై ఇరువురి మధ్యా జరిగే ద్వైపాక్షిక చర్చలలో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టాక్స్ టెర్రర్ యావత్ ప్రపంచాన్నీ కుదిపి వేస్తున్న నేపథ్యంలో మోడీ, పుతిన్ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   

రష్యా నుంచి భారత్ చమురుకొనుగోలును ఆపేయాలంటూ తాను జారీ చేసిన హుకుంను భారత్ లెక్క చేయకపోవడంతో ఉక్రోషంతో రగిలిపోతున్న ట్రంప్ సుంకాలను పెంచేసి భారత్ ను లొంగదీసుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ట్రంప్ ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడి భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే పుతిన్ భారత పర్యటన పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమౌతుండటమే కాకుండా.. ఈ పర్యటన విజయవంతం కావాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. 

ఇలా ఉండగా పుతిన్ బారత్ లో పర్యటించడానికి ముందే.. భారత్ లో రష్యా సంబంధాల పట్ల సానుకూల ప్రకటన విడుదల చేశారు. వాణిజ్య లోటు విషయంలో భారత ఆందోళనలు తమకు తెలుసంటూనే.. దాన్ని బ్యాలెన్స్‌ చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామనీ, ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ మధ్య చర్చలు ఉంటాయనీ పుతిన్ పేర్కొన్నారు.   ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు చేరాలన్న లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్లు పుతిన్ చెప్పారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu