భారత్‌కు చేరుకున్న పుతిన్...అపూర్వ స్వాగతం పలికిన మోదీ
posted on Dec 4, 2025 8:37PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నేడు ఢిల్లీ చేరుకున్నారు. పాలం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు ప్రధాని మోదీ సాదరంగా స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధాని ప్రోటోకాల్‌ను ప్రక్కకు పెట్టి పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు దేశాధినేతలు సమావేశం కానున్నారు.
ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం రాత్రి ప్రధాని ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలకనున్నారు. అలాగే, 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి. మొత్తం 8 మంది మంత్రుల బృందంతో పుతిన్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ట్వీట్ చేసింది. అత్యంత పటిష్ఠ భద్రత మధ్య పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది.