రెండేళ్లుగా ఒక గంట కూడా రెస్ట్ తీసుకోలేదు : సీఎం రేవంత్
posted on Dec 4, 2025 4:09PM

గత రెండేళ్లుగా ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చూట్టారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఆతర్వాత అభివృద్ధే లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజలకు మంచి చేయాలని నిరంతరం పనిచేస్తున్నట్లు రేవంత్ అన్నారు. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రజలు బీఆర్‌ఎస్ పాలనకు చమర గీతం పాడారని సీఎం అన్నారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు కావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాతో అన్నారు.
ఇదే విషయం నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీతో మాట్లాడాను అని సీఎం అన్నారు. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని రేవంత్ అన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ప్రాంతంలో ఎయిర్ బస్సు తీసుకొచ్చి నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నా అని తెలిపారు.