రెండు గంటలకు రూ. 11 కోట్లు తీసుకున్నా : ప్రశాంత్ కిశోర్
posted on Sep 29, 2025 3:02PM

రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ తన పార్టీ విరాళాల గురించి వస్తోన్న ఆరోపణలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2011 నుంచి ఇప్పటి వరకు కన్సల్టెన్సీ సేవలతో రూ. 241 కోట్లు సంపాదించినట్లు వెల్లడించారు. వీటిలో రూ. 30.95 కోట్లు జీఎస్టీ రూ. 20 కోట్లు , ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లించి.. తన సొమ్మను పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు వివరించారు. తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకానొకదశలో రెండు గంటలకు రూ.11 కోట్లు తీసుకున్నా. ఇది ఈ బిహార్ కుర్రాడి శక్తి’’ అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేశారు.
డొల్ల కంపెనీల నుంచి విరాళాలు వస్తున్నాయని ఆరోపించిన వారికి మీడియా ఎదుట గట్టి కౌంటర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి గురించి మాట్లాడుతూ.. 1995లో ఓ హత్య కేసులో ఆయన దోషిగా తేలారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తాను మైనర్‌నంటూ తప్పుడు పత్రాలు సమర్పించడం వల్ల ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు.
తాను సంపాదించిన నిధులు వృత్తిపరమైన ఫీజుల ద్వారానే వచ్చాయని, వాటిపై జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లించి పార్టీకి విరాళాలుగా ఇచ్చినట్లు వెల్లడించారు. ‘‘డొల్ల కంపెనీల నుంచి డబ్బులు వచ్చాయన్న ఆరోపణలు నిరాధారమని’’ మీడియా ఎదుట ప్రశాంత్ కిశోర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి గురించి మాట్లాడుతూ.. 1995లో హత్య కేసులో ఆయన దోషిగా తేలినా, తప్పుడు పత్రాలతో శిక్ష తప్పించుకున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పూర్తిచేయని వ్యక్తి డిగ్రీ పట్టా పొందడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్న జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ రెండింటినీ ప్రశాంత్ తీవ్రంగా విమర్శించారు. ‘‘కాషాయ పార్టీ నేతలు లాలూ కంటే ఎక్కువ అవినీతి చేస్తున్నారు’’ అని ఆరోపించారు.
లాలూ కుటుంబంపై విమర్శలు చేస్తూ.. ‘‘ప్రజలు పిల్లల భవిష్యత్తు ఎలా చూసుకోవాలో లాలూ నుంచి నేర్చుకోవాలి. ఆయన కుమారుడు తేజస్వీ 9వ తరగతి కూడా పాస్ కాలేదు. అయినా ఆయనను బిహార్ ‘రాజు’ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సామాన్యుల పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా ఉద్యోగం దొరకడం లేదు’’ అని పీకే దుయ్యబట్టారు.