చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కి మోడీ ఘన స్వాగతం

 

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కి చేరుకున్నారు. చైనా ఉన్నతాధికార వర్గంతోపాటు సతీ సమేతంగా అహ్మదాబాద్‌కి చేరుకున్న జిన్ పింగ్‌కి భారత ప్రధాని నరేంద్రమోడీ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. తన పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్తో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జిన్ పింగ్, నరేంద్ర మోడీ కలసి పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. జిన్ పింగ్ బృందం శ్రీలంక పర్యటన పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu