రాహుల్ నోట మళ్లీ ఓటు చోరీ మాట!
posted on Jan 17, 2026 9:19AM
.webp)
కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నోట మళ్లీ ఓటు చోరీ మాట వచ్చింది. మహా మునిసిపల్ ఎన్నికలలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన రాహుల్ గాంధీ, ఎన్నికలలో ఓటు వేసే సమయంలో ఓటర్ల వేలికి వేసే సిరాకు బదులు మార్కర్ పెన్నులు ఉపయోగించడం ద్వారా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాగా ఓటర్ల వేలికి సిరాకు బదులు మార్కర్ పెన్ను ఉపయోగించడంపై కాంగ్రెస్ మాత్రమే కాకుండా ఎన్డీయే కూటమి యేతర పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మహా మునిసిపోల్స్ లో మరీ ముఖ్యంగా బృహాన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు.