ఏపీలో ప్లాస్టిక్ నిషేధం.. ఎప్పట్నుంచంటే?

ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ నిషేధం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజధాని నగరం అమరావతిలోని సెక్రటేరియెట్ లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం.. ఇప్పడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలలో వచ్చే నెల 2 నుంచి అంటే గాంధీ జయంతి రోజు నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలులోనికి వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు.

ఇక ఆ తరువాత డిసెంబర్ 31 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనున్నట్లు ఆయన తెలిపారు.  విజయవాడలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం (సెప్టెంబర్  18)న జరిగిన స్వచ్ఛతా హి సేవ అవగాహన కార్యక్రమంలో మంత్రి నారాయణ ప్రసంగించారు. ఏ రోజు చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేసే విధంగా రాష్ట్రంలో 50 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu