ప్రమాదవశాత్తు రైల్లోంచి పడి నవదంపతులు దుర్మరణం

కొత్తగా పెళ్లైన దంపతులు రైలు నుంచి జారి పడి దుర్మరణం పాలైన ఘటన   యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి  రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం (డిసెంబర్ 18) అర్ధరాత్రి సమయంలో జరిగింది. మృతు లను ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా   గుర్తించారు.

ఇటీవలే వీరికి వివాహమైంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.  హైదరాబాద్ నుంచి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో  డోర్ వద్ద నిలబడిన ఈ జంట ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu