రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీ కొని ఎనిమిది ఏనుగులు మృతి.. అసోంలో విషాదం
posted on Dec 20, 2025 12:17PM

రైలు ఢీకోని ఎనిమిది ఏనుగులు మృత్యువాతపడిన విషాద ఘటన అసోంలో శుక్రవారం (డిసెంబర్ 20) తెల్లవారు జామున జరిగింది. సైరంగ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో రైలు ప్రయాణీకులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
కాగా ఈ ఘోర ప్రమాదం నుంచి ఒక గున్న ఏనుగు సురక్షితంగా తప్పించుకుంది. ఆ గున్న ఏనుగును అటవీశాఖ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అదలా ఉంటే ఈ ప్రమాదం గువాహటికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.