శశికళ సంస్థల్లో ఈడీ సోదాలు

 

తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ చెందిన సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్త్నె, హైదరాబాద్‌లోని 10 చోట్ల తనిఖీలు నిర్వహించింది. జీఆర్‌కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. జీఆర్‌కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులను రూ.200 కోట్లకు మోసం చేశారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. కనీసం పది స్థలాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్‌ఎ నిబంధనల కింద దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 

ఈ దర్యాప్తు రూ.200 కోట్ల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించినదని, దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు కీలక నగరాల్లో ఈడీ చేసిన సోదాలపై మాత్రం అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదు. ఈ కేసు ఆధారంగా, నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో శశికళతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu