ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కార్యాలయం సీసీఎస్ కు మార్పు

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం హదరాబాద్ సీపీ నేతృత్వంతో  మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొనసాగిన  సిట్ కార్యాలయాన్ని  కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ (సిసిఎస్)కు మార్చారు. శనివారం (డిసెంబర్ 20) నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యకలాపాలన్నీ సీసీఎస్ కేంద్రంగానే సాగుతాయి. 

 ఫోన్ ట్యాపింగ్‌  కేసులో మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  

ఈ సిట్‌ లో  రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి,   డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.   రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ కు విస్తృత అధికారాలు కల్పించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.  

ఇలా ఉండగా ఈ కేసులో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ ఎంక్వయిరీలో ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును సిసిఎస్‌కు తరలించారు. సిసిఎస్‌లో ప్రభాకర్ రావుకు ప్రత్యేక గదిని సిట్ ఏర్పాటు చేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu