టీ20 వరల్డ్ కప్.. టీమ్ ఇండియా జట్టు ఇదే.. శుభమన్ గిల్ కు ఉద్వాసన
posted on Dec 20, 2025 4:09PM

టి20 వరల్డ్ కప్ కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించింది. వరల్డ్ కప్ కు ప్రకటించిన జట్టే న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు ఎంపికయ్యింది. విశేషమేంటంటే.. టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన శుభమన్ గిల్ కు ఈ జట్టులో స్థానం దక్క లేదు.
ఇలా ఉండగా దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ లో విఫలమైనా కూడా సూర్యకుమార్ యాదవ్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అంతే కా కుండా అతడినే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక వైస్ కెప్టెన్ గాఅక్షర్ పటేల్ ను నియమించారు.
ఇషాన్ కిషన్ రింకూ సింగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. వరల్డ్ కప్ కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ వర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, బూమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్.