అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
posted on Dec 30, 2024 12:33PM
సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ గోరుతో పోయేది గొడ్డలితో తెచ్చుకున్నాడని ఎపి డిప్యూటి సిఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన రేవతి కుటుంబాన్ని పరామర్శించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసుల పనితీరును తప్పు పట్టలేమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అయితే కేవలం అల్లు అర్జున్ మాత్రమే బాధ్యడు కాదని పుష్ప టీం నుంచి ఎవరో ఒకరు పరామర్శించి ఉంటే వివాదం ఇంత ముదిరేదికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లు అర్జున్ కు మానవతా దృక్పథం లోపించడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. క్రిందిస్థాయి నుంచి ఎదిగిన నేత రేవంత్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
ఎపి ఎన్నికల సమయంలో రాజుకున్న మెగా కుటుంబం వర్ససె అల్లు అర్జున్ వివాదం మళ్లీ రచ్చయ్యింది. అప్పట్లో అల్లు అర్జున్ వైకాపాకు సపోర్ట్ చేయడం, మెగా కుటుంబాన్ని పక్కకు పెట్టడంతో విభేధాలు మరింత ముదిరాయి. సంధ్య థియేటర్ వివాదం సద్దుమణిగిందని అనుకునే సమయంలోనే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ తో వివాదం మరింత ముదిరింది.