హరిహర వీరమల్లు ట్రైలర్...ద్వారా మనకేం తెలుస్తోంది?

 

పవన్ కళ్యాణ్‌ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి. వినిపించాయి. అంతే కాదు, కోహినూర్, ఔరంగజేబ్ వంటి ఆనవాళ్లతో హర హర మహదేవ్ అనే బీజింగ్ మధ్య.. ఈ ట్రైలర్ డెడికేటెడ్ టూ హిందూస్ అన్నది స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇక ధర్మానికి సంబంధించిన టెక్స్ట్ కూడా ప్లే కావడం చూస్తుంటే సనాతన ధర్మం పవన్ కేవలం తన పొలిటికల్ ఎజెండా మాత్రమే కాకుండా.. దాన్ని సినిమాల ద్వారా కూడా వ్యాప్తి చెందించే యత్నంగా భావిస్తున్నారు.

గతంలో  మోడీ బాలీవుడ్ మొత్తాన్ని పిలిచి.. ఇప్పటి వరకూ చరిత్రలో మరుగున పడ్డ హిందూ అన్ సంగ్ హీరోలు, వారికి సంబంధించిన అన్ టోల్డ్ స్టోరీలు తీయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ వంటి వారు తప్ప.. మిగిలిన హీరోల్లో చాలా మంది ముస్లిములు ఉండటం వల్ల ఏమంత ఎక్కువగా ఈ తరహా  సినిమాలు రావడం లేదు. వచ్చినా అవి చావా రేంజ్ లో జనాల్లోకి వెళ్లడం లేదు. 

అయితే పవన్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా ఉండటం వల్ల.. అందునా బీజేపీతో టై- అప్ అయి ఉండటం వల్ల.. ఆయనకంటూ ఒక వెసలుబాటు ఏర్పడింది. ఇప్పటికే ఆయన తెరబయట కూడా సనాతన ధర్మ వారధిగా విశేషంగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. మొన్నటికి మొన్న- తమిళనాడు మురుగన్ మానాడులో ఆయన మత ప్రసంగాలపై క్రిమినల్ కేసులు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో ఆయన తగ్గుతాడనుకుంటే.. హరి హర వీరమల్లు వంటి చిత్రాలతో మరింతగా చెలరేగేలా తెలుస్తోంది.

అంతేనా ఈ పార్ట్ 1లో కత్తికి- దెయ్యానికీ మధ్య యుద్ధం అన్న అర్ధమొచ్చేలా 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అన్న కలరింగ్ ఇస్తున్నారు. అంటే రెండో పార్టు కూడా అంతే స్థాయిలో హిందుత్వ భావజాల వ్యాప్తి ఉండేలా కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్‌ పూర్తి హిందుత్వం పుణికి పుచ్చుకున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు!