కర్ణాటకలో మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని
posted on Aug 10, 2025 3:50PM

కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. బెంగళూరులో మూడు వందే భారత్ రైళ్లు, మెట్రో ఎల్లో మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్బంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు కేంద్రమంత్రులతో కలిసి ప్రధాని మెట్రోలో ప్రయాణించారు. వారితో సరదాగా ముచ్చటించారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మెజెస్టిక్‌లోని సంగొళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్‌కు చేరుకొని బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపారు. అలాగే అమృత్‌సర్– శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్–పూణె మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం ఆర్‌వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు చేరుకొని మెట్రో ఎల్లో మార్గం ప్రారంభించి.. మెట్రో రైలులో ఎల్రక్టానిక్ సిటీ వరకు ప్రయాణించారు.