శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్‌పై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ

 

నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భక్తులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్వరితగతిన శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకుని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు తిరిగి గమ్య స్థలాలకు  వెళ్లే విధంగా ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాతో పోలీసుల పర్యవేక్షణ చేపట్టారు . నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు  ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.  

వరుస సెలవులు రావడంతో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సి ఐ చంద్రబాబు  ప్రత్యేక చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాతో శ్రీశైలం హైదరాబాద్ డ్యామ్ పరిసరాలను ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్ జామ్ కు ఏమైనా అవుతుందా అని మొబైల్ పార్టీని అనుసంధానం చేస్తూ శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu