తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే పిల్లలు అబద్దం చెప్పడానికి ముఖ్య కారణాలు..!

 

ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ నిజాయితీగా, వివేకవంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు పిల్లలు అకస్మాత్తుగా అబద్ధం చెబుతారు. ఆ తరువాత వారి ప్రవర్తన అలానే కొనసాగుతుంది.   పిల్లలు అలా చేయడం తెలిసిన తరువాత  తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. అసలు పిల్లలు అబద్దం చెప్పడం ఎందుకు నేర్చుకుంటారు? పిల్లలు అబద్ధం చెప్పకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలి? పిల్లలు అబద్దం చెప్పే విషయంలో  తల్లిదండ్రులు చేసే ఐదు సాధారణ తప్పులు తెలుసుకుంటే..

శిక్ష..

 పిల్లు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు శిక్షతో బెదిరిస్తే, తదుపరిసారి భయం కారణంగా వారు నిజం దాచడం ప్రారంభిస్తారు.  ఇది అబద్ధం చెప్పే అలవాటును పెంచుతుంది. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ నిజం చెప్పినందుకు శిక్ష పడుతుందనే భయం లేనప్పుడే పిల్లలు తన తల్లిదండ్రుల ముందు తన తప్పును అంగీకరిస్తాడు.

అతిగా రియాక్ట్ కావడం..

తల్లిదండ్రులు చిన్న విషయాలకు కోపం చేసుకున్నా  లేదా అరిచినా పిల్లలు నిజం చెప్పలేరు. ఎందుకంటే  నిజం చెప్పి ఇబ్బందులను ఆహ్వానించడం సరికాదని పిల్లలు భావిస్తారు. ఈ కారణంగా పిల్లలు అబద్ధాన్ని తన రక్షణ కవచంగా చేసుకుంటాడు.  ఏదైనా చెప్పడం కంటే విషయాలను దాచడం మంచిదని పిల్లలు భావిస్తారు.

భావాలను విస్మరించడం..

పిల్లల మాటలను విస్మరించినప్పుడు లేదా తీవ్రంగా పరిగణించనప్పుడు పిల్లలు  తమ ఆలోచనలను మార్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి వారికి నిజాలు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటారు.  నిజాలు  దాచడం ప్రారంభిస్తారు. తరచుగా తెలిసి లేదా తెలియకుండా తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలను, వారి ఇష్టాన్ని  పరిగణలోకి తీసుకోకుండానే నిర్ణయాలు చేస్తారు. తల్లిదండ్రుల ఈ అలవాటు పిల్లవాడు వారి ముందు నిజం మాట్లాడకుండా చేస్తుంది.

అబద్దం..

తల్లిదండ్రులు స్వయంగా ఇతరులకు అబద్ధం చెబితే, ఉదాహరణకు ఫోన్‌లో 'నేను ఇంట్లో లేను' అని చెప్పడం వంటివి చేస్తే, పిల్లవాడు దానిని సాధారణమైనదిగా భావిస్తాడు.  పిల్లలు  కూడా అదే చేయడం ప్రారంభిస్తారు. అదే సమయంలో, తల్లిదండ్రులు తరచుగా పిల్లల ముందు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటారు. ఇవన్నీ చూసినప్పుడు,  అబద్ధం చెప్పడం ఒక సాధారణ విషయంగా పిల్లలు పరిగణిస్తారు.  తను కూడా అబద్దం చెప్పడం అలవాటు చేసుకుంటారు.

విమర్శ..

పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు అతన్ని విమర్శిస్తే, ఇంకొకసారి తల్లిదండ్రులు తనను విమర్శించకూడదని  నిజం దాచడానికి అబద్దం చెబుతాడు. సాధారణంగా పాఠశాల పరీక్షలలో పిల్లవాడు తక్కువ మార్కులు పొందినప్పుడు ఇది కనిపిస్తుంది. తల్లిదండ్రులు తన మార్కుల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు, పిల్లవాడు ఇంకొకసారి  తన రిపోర్ట్ కార్డును వారికి చూపించకుండా  అబద్ధం చెప్పడం వంటివి చేస్తాడు.


                              *రూపశ్రీ.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu