కష్ట సమయాలను త్వరగా అధిగమించడం ఎలా? చాణక్యుడు చెప్పిన రహస్యాలు ఇవే..!
posted on Jul 22, 2025 9:30AM
.webp)
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషమే కావాలని కోరుకుంటారు. కష్టం కావాలని, ఇబ్బందులు ఎదుర్కోవాలని ఏ కోశాన ఆలోచించరు. కానీ కష్టసుఖాలు అనేవి చీకటి వెలుగుల లాంటివి. ఒకదాని తరువాత మరొకటి రాక తప్పవు. అయితే సంతోష సమయాలను ఆస్వాదించినట్టు వాటిని స్వీకరించినట్టు కష్ట సమయాలను తీసుకోలేరు. కానీ ఆచార్య చాణక్యుడు చెప్పిన రహస్యాలు తెలుసుకుంటే.. ఈ కష్ట సమయాలను కూడా చాలా త్వరగా, సులువుగా దాటేయచ్చు. అవేంటో తెలుసుకంటే..
వాస్తవం..
ఏ వ్యక్తినైనా జీవితంలో అత్యంత కష్టతరమైన సమయమే ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది స్వంత సామర్థ్యాలను గుర్తించగలిగే సమయం. ఇతరుల కంటే తాము ఎంత బలంగా ఉన్నాము, ఇతరుల కంటే ఎంత ప్రత్యేకంగా ఉన్నాం.. అనే విషయాన్ని ఇది తెలుపుతుంది.
ఓపిక..
కష్ట సమయాల్లో ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఓపిక లేకపోతే తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోవచ్చు. దీని కారణంగా సమస్య మరింత పెరుగుతుంది. దీనితో పాటు చెడు సమయాల్లో జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం.
ఆలోచన..
కష్ట సమయంలో ఒక చిన్న తప్పు కూడా చాలా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. అందుకే ఆచార్య చాణక్యుడు కష్ట సమయాల్లో ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయాలని చెబుతాడు.
బలం..
కష్ట సమయాల్లో తన బలాన్ని గుర్తించి, దానిని సరిగ్గా ఉపయోగించుకునే గుణం వ్యక్తికి ఉండాలి. కష్ట సమయాల్లో తన సామర్థ్యాలను విశ్వసిస్తే, త్వరగా పరిష్కారం కనుగొంటాడని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.
ఆరోగ్యం..
కష్ట సమయాల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక స్థితి కూడా దృఢంగా ఉంటుంది.
ప్రణాళిక..
చాణక్యుడి ప్రకారం ప్రతి వ్యక్తికి కష్ట సమయాల్లో ఒక ప్రణాళిక ఉండాలి. తద్వారా సరైన దిశలో ముందుకు సాగవచ్చు. దీనితో పాటు, ప్రతి వ్యక్తి చెడు సమయాల్లో ఉపయోగకరంగా ఉండేలా డబ్బును కూడా ఆదా చేయాలి.
సానుకూలత..
కొంతమంది కష్టకాలం వచ్చిన వెంటనే కొన్ని వదిలేయాలని చూస్తారు. ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రయత్నించరు. అందుకే ఆచార్య చాణక్యుడు క్లిష్ట పరిస్థితుల్లో ఆలోచనను సానుకూలంగా ఉంచుకోవడం ముఖ్యం అని చెప్పారు. సానుకూల ఆలోచనతో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. దీనితో పాటు బలాన్ని పొందుతూ ఉండటానికి కుటుంబ సహకారం కూడా అవసరం.
*రూపశ్రీ.