గొంతు ఒణికింది.. పాట ఒలికింది..!

ప్ర‌బాస్‌,అనూష్కాలో, చెర్రీ కాజ‌లో ఇర‌వై ఎనిమిది వొంపులు తిరుగుతూ ఇంట్లో,పార్క‌లో, రోడ్డుమీదో, విదేశీ ప‌ర్వ‌తాల మీదో ఎగిరేనే ప్రేమ‌, ప్రేమించుకోవ‌డమే ప్రేమ కాదు. పండువ‌య‌సులోనూ క‌లిసి ఉండ టం, స‌ర‌దాగా ఉండ‌టం, బాధ‌ల్ని, స‌మ‌స్య‌ల్ని మ‌ర్చిపోతూ మాట్లాడుకోవ‌డం. ప్ర‌బాస్‌కి అనూష్క ఏం పాడినా, కాజ‌ల్ చెర్రీ కోసం ఏం మాట్లాడినా..ఓ పెద్దామె మాత్రం ఆస్ప‌త్రిలో మంచంలో ఉన్న భ‌ర్త‌కోసం పోర్చుగీస్ గీతం పాడింది!

ప్రేమ ఓ గొప్ప‌భావ‌న‌. దాన్ని ఆక‌ళింపుచేసుకోవాలి. ప్రేమంటే సినిమాల్లో ప్రేమ కాదు. మ‌నిషిని మ‌నిషిగా చూడ్డం, గౌర‌వించ‌డం. జాతి, కుల‌, మ‌తాల‌కు, దేశ విదేశాల‌కు స‌రిహ‌ద్దులు చెరిపేసి ఒక్క‌టిగా చేయ‌గ‌లి గేది. అలా ఆ స్థాయిలో ఉండ‌గ‌లిగేవారిదే అస‌లు ప్రేమ‌. ఇద్ద‌రు ఒక్క‌ట‌యి జీవితాంతం క‌లిసి ఉండ డంలో ప్ర‌ద‌ర్శించే అనురాగాప్యాయ‌త‌లే ప్రేమ‌. పండు ముస‌లి వార‌యినా ఒక‌రికోసం ఒక‌రు అను కోవ డంలోని అద్బుతానందం అనంతం. దానికి లోకం స‌లామ్ అనే అంటుంది. 

ఆస్ప‌త్రిలో అనారోగ్యంతో ఉన్న త‌న భ‌ర్త‌కు ఎప్పుడూ వినిపించే పాట‌నే వినిపిస్తూ అత‌నికి ఆస్ప‌త్రిలో ఉన్నాన‌న్న స్పృహ లేకుండా చేయ‌డానికి పెద్దావిడ మ‌ళ్లీ గొంతు స‌వ‌రించుకుంది. ల‌తామంగేష్క‌ర్ కాన క్క‌ర్లేదు.. ఒణుకుతున్న స్వ‌రంతో అత‌ని చేయి ప‌ట్టి రెండు నిమిషాలు పాడిన‌ట్టు చేసినా అది గొప్ప స్వాంత‌న‌నిస్తుంది. అది ప్రేమంటే. ఈ పెద్దావిడ త‌న 70 ఏళ్ల భ‌ర్త కోసం బ్రిజిల్ గీత ర‌చ‌యిత రాసిన పోర్చుగీసు గీతం..కోమో గ్రాండీ ఓమెని..అంటూ పాడింది. ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఎంతో ఆనందించాయి. ఆయ‌న‌కు మందులు, ఆస్ప‌త్రి ఇబ్బందుల త‌ల‌నొప్పి పోయి ప్ర‌శాంతంగా నిద్ర‌పోయాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu