అమరావతి నడిబొడ్డున ఎన్టీఆర్ స్మృతివనం!
posted on Sep 15, 2025 4:24PM

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్డున ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ స్మృతివనంలో 182 మీటర్ల ఎత్తైన తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్నిఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తెలుగు ప్రజల గౌరవం, వారసత్వ ఔన్నత్యం, ఆత్మగౌరవాలకు నిలువెత్తు ప్రతీకగా ఉండాలని చంద్ర బాబు భావిస్తున్నారు. ఈ మేరకు సచివాలయంలో రెండు రోజుల కిందట తన క్యాంప్ కార్యాలయంలో అలాగే స్మృతివనం వద్ద ఏర్పాటు చేయనున్న విగ్రహాల నమూనాలను కూడా పరిశీలిం చారు. కాగా స్మృతి వనంప్రాజెక్టు డిజైన్ లో తెలుగు సంప్రదాయాలు, భాష, కళలు, సాహిత్య చరిత్రను పొందుప రచాలని చంద్రబాబు ఆదేశించారు.
ఎన్టీఆర్ విగ్రహంతో పాటు, ఈ స్మృతి వనంలో స్వాతంత్ర్య సమర యోధులు, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి ప్రముఖుల విగ్రహాలు, తెలుగు భాష మరియు లిపి పరిణామాన్ని వివరించే అంశాలూ కూడా ఉండేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. అంశాలు కూడా ప్రదర్శించబడతాయి. ఎన్టీఆర్ స్మృతివనం డిజైన్‌ను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు.