నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు
posted on Dec 20, 2025 8:10PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రోజు నాంపల్లిలోని ప్రజాప్రతి నిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. గతంలో తనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి విచారణలో భాగంగా సిఎం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావడం ప్రాధాన్యతను సంతరిం చుకుంది. 2016లో ఉస్మానియా యూనివర్సిటీ లో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించా రనే ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుతో పాటు తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ వివిధ కారణాలతో సిఎం రేవంత్ రెడ్డి పై కేసులు నమోద య్యాయి.ఈ కేసులన్నీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమంగా పెట్టినవని పేర్కొంటూ, వాటిని కొట్టి వేయాలంటూ ముఖ్యమంత్రి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో కొనసాగుతున్న విచారణకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై తన వాదనలను వినిపించారు.
ముఖ్యమంత్రి హాజరు సందర్భంగా పోలీస్ యంత్రాంగం కోర్టు ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఆదేశాలు, తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన ఈ కేసులపై కోర్టు తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.