ఏపీ లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్
posted on Sep 15, 2025 5:21PM
.webp)
ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ మరో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(ఏ-38), అతని మిత్రుడు సీహెచ్ వెంకటేశ్‌నాయుడుప్రధాన అనుచరుడు ఎం.బాలాజీకుమార్ యాదవ్ (ఏ-35), వ్యక్తిగత సహాయకుడు ఈ.నవీన్‌కృష్ణల (ఏ-36) ప్రమేయలపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధం అభియోగపత్రంతో కలిసి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లైంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు కేసులో 48 మంది నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 12 మంది అరెస్ట్ కాగా నలుగురికి బెయిల్ వచ్చింది. గత వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్ల స్కామ్ జరిగింది. లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. ముడుపుల సొమ్ము తరలింపు, కలెక్షన్ పాయింట్‌లకు చేరవేయడంలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్‌నాయుడు కీలకంగా ఉన్నట్లు, బాలాజీ, నవీన్‌కృష్ణలు వారికి సహకరించినట్లు సిట్ గుర్తించింది. దీనికోసం తుడా వాహనాలు వినియోగించినట్లు తేల్చింది. ఈ సమాచారంతో పాటు ఆ నిధులు ఎవరెవరికి చేర్చారో కూడా ఈ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.