నవ దంపతుల మృతి ఘటనలో కొత్త ట్విస్ట్!

 

కొత్తగా పెళ్లయిన ఈజంట... ట్రైన్లో సరసాలు ఆడుతూ సరదాగా గడిపారు. సంతోషంగా కనిపిస్తున్న ఈ నవ దంపతుల సంతోషం కొద్దిసేపట్లో ముగిసిపోతుందని ఎవరైనా ఊహించగలరా.... కొన్ని  క్షణాల్లోనే ఆ ఇద్దరు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతారా ఎవరైనా ఊహిస్తారా... కానీ ఎవ్వరూ ఊహించలేనిది ఆ ట్రైన్ లో ఒక్కసారిగా జరిగేసరికి ట్రైన్ లో ప్రయాణిస్తున్న వారందరూ ఉలిక్కిపడ్డారు... ట్రైన్ లో నవవరుడు భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ సరదాగా గడుపు తున్న సమయంలో ఈ నవజంట ఒక్కసారిగా అదుపు తప్పి ట్రైన్ నుండి కింద పడిపోయి మృత్యువాత పడ్డారు. 

ఇది చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.  ఆ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైలుమార్గం లో చోటుచేసుకున్న విషాదకరమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి సమయంలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది .మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా రైల్వే పోలీసులు గుర్తించారు. 

ట్రైన్లో ఈ నవ దంపతులు సంతోషంగా ఉన్నా సమయంలో కొందరు వీడియో తీశారు... ఈ నవజంట మృత్యువాత పడిన అనంతరం ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి... ఈ వీడియోలను చూసిన ఇరు కుటుంబ సభ్యులు బోరున వినిపించ సాగారు. ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్న ఈ యువ దంపతులు క్షణాల్లోనే మృత్యువాత పడడంతో రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu