రియాజ్ ఎన్‌కౌంటర్‌పై క్లారిటీ ఇచ్చిన నిజామాబాద్ సీపీ

 

నిజామాబాద్‌లో రెండు రోజుల క్రితం  కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడని రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీపీ చైతన్య ఖండించారు. రియాజ్ మరో వ్యక్తిపై దాడి చేసి పారిపోతుండగా పట్టుకున్నామని  నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్‌ పోలీసు కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. అందులో..‘నిజామాబాద్‌ టౌన్‌ 6 పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని సారంగపూర్‌ ప్రాంతంలో ఆసిఫ్‌ అనే వ్యక్తిపై రియాజ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఆసిఫ్‌,రియాజ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రియాజ్‌ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు’ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. దీంతో బృందాలు ఏర్పడి గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu