ఫస్ట్ ఇండియన్ సినిమాగా వారణాసి.. మహేష్, రాజమౌళి మ్యాజిక్ షురూ
on Jan 6, 2026

రిలీజ్ కి రెండు సంవత్సరాల ముందే వారణాసి రికార్డు
ఇంతకీ ఆ రికార్డు ఏంటి
పారిస్ లోని ఆ థియేటర్ ఏమంటుంది
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)..దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli)..ఇప్పుడు ఈ ఇద్దరు తెలుగు సినిమాని ప్రపంచ సినీ యవనిక పై నిలబెట్టడానికి 'వారణాసి' ని ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరు ఊహించని కథ, కథనాలతో సిల్వర్ స్క్రీన్ పై వారణాసి ద్వారా ఒక కొత్త లోకం కూడా ఆవిష్కతం కాబోతుంది. అందుకు నిదర్శనం 'రుద్ర' అనే క్యారక్టర్ లో మహేష్ తన మెడలో ధరించిన శివలింగంతో పాటు రాముడిగా కూడా కనిపిస్తుండటం. మరో వైపు ప్రాచీన యుద్ధ విద్య 'కలరిపయట్టు' కూడా 'వారణాసి' కోసం నేర్చుకోవడం. దీన్ని బట్టి కథ, కథనాలు ఏ విధంగా ఊహకి అందని విధంగా ఉండబోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఈ పాన్ వరల్డ్ చిత్రం దగ్గరకి ఒక రికార్డు వచ్చి చేరింది.
నిన్న జనవరి 5 న 'వారణాసి' టైటిల్ టీజర్ ని 'పారిస్'(Paris)దేశంలో ఉన్న 'లే గ్రాండ్ రెక్స్'(le grand rex)థియేటర్ లో ప్రదర్శించడం జరిగింది. గతంలో రజనీకాంత్ నుంచి వచ్చిన కబాలి, ప్రభాస్ బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 , సాహూ వంటి చిత్రాలని డైరెక్ట్ గా ఈ థియేటర్ లో ప్రదర్శించారు. కానీ టీజర్ ప్రదర్శించిన తొలి ఇండియన్ సినిమాగా మాత్రం వారణాసి నిలిచింది. దీంతో ఇండియన్ సినిమా ఖ్యాతిని వారణాసి రెట్టింపు చేసినట్లయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా హంగామ చేస్తున్నారు. ఇక తమ థియేటర్ లో వారణాసి టీజర్ ప్రదర్శించడంపై సోషల్ మీడియా వేదికగా లే గ్రాండ్ రెక్స్ యాజమాన్యం స్పందిస్తు 'లోకల్ ఆడియన్స్ నుంచి టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం జరిగిందని తెలిపింది.
Also Read: పోసాని వల్ల నా లైఫ్ నాశనమయ్యింది..హీరోపై కడప వ్యక్తులు చెప్పమంది ఇదే
సుమారు పదమూడు వందల కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'వారణాసి' లో ప్రియాంక చోప్రా(Priyanka Chopra),పృథ్వీ రాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ, మందాకినీ క్యారెక్టర్స్ లు కూడా ఎవరు ఊహించని విధంగా ఉండబోతున్నాయి. 2027 ఏప్రిల్ 9 రిలీజ్ డేట్ అని ప్రచారంలో ఉండగా మొత్తం 120 దేశాల్లో రిలీజ్ కి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీ దుర్గ ఆర్ట్స్ పై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



