కొత్త సిట్ చేతికి వివేకా కేసు. ఏప్రిల్ 30లోగా తేల్చాలన్న సుప్రీమ్

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ఇప్పటి వరకు కేసు  దర్యాప్తు చేస్తున్న బృందాన్ని సీబీఐ మార్చేసింది.  కొత్త బృందాన్ని నియమించింది.  కొత్త బృందం   వేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీం కోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీం కోర్టు గడువు విధించింది. ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో  ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ  నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది.

వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐకి సుప్రీం కోర్టు నెల రోజులు గడువు ఇచ్చింది. ఏప్రిల్‌ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. వివేక హత్య కేసులో ఐదో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం... ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.  

రెండు రోజుల క్రితం ఈ కేసులోనే సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  సీల్డ్ కవర్‌లో సమర్పించిన వివరాలను పరిశీలించి కేసు పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి విదితమే.