మే 10 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. 13న ఫలితాల విడుదల

కర్నాటక అసెంబ్లీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మే 10న  కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. అదే నెల 13న ఓట్ల లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు.   కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి  రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు.

 కర్నాటకలో ఈ సారి ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల  13న ఎన్నికల విడుదల కానుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ఉంటుంది. 

కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లుకు కుమార్ తెలిపారు.  58,282 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈసీ  వెల్లడించారు. వీటిలో మహిళలకు ప్రత్యేకంగా  1320 పోలింగ్ స్టేషన్లు  కేటాయించామన్నారు.   దేశ ఎన్నికల చరిత్రలో తొలి సారిగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో 80 ఏళ్ల వయసు దాటిన వారికి, దివ్యాంగులకు  ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ తెలిపారు.