జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్నారు..

రాజారెడ్డి రాజ్యాంగం.. రాక్ష‌స పాల‌న.. అంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై టీడీపీ మొద‌టి నుంచీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది. ఆ పార్టీ ఆరోపిస్తున్న‌ట్టే.. ఏపీలో రౌడీ మూక‌లు రెచ్చిపోతున్నాయి. అరాచ‌క‌, విధ్వంస‌కాండ కొన‌సాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లా పెద‌నందిపాడు మండ‌లం కొప్ప‌ర్రులో టీడీపీ నాయ‌కురాలి ఇంటిపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. మొన్న‌టికి మొన్న ఉండ‌వల్లిలో ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇంటిపైనే దాడికి తెగించిన వైసీపీ మూక‌లు.. అదే స్పూర్తిగా తీసుకున్నారో ఏమో తాజాగా కొప్ప‌ర్రులో టీడీపీ మాజీ జెడ్పీటీసీ ఇంటిపై మ‌రింత‌గా రెచ్చిపోయారు. అర్థ‌రాత్రి అర‌ణ్య‌కాండ సృష్టించారు. రాళ్ల దాడితో ఇంటిని ధ్వంసం చేశారు. వాహ‌నాల‌కు నిప్పంటించి కిష్కింద‌కాండ చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో ఏకంగా ఓ ఎస్సైకి త‌ల ప‌గ‌ల‌డం.. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉందంటే.. వైసీపీ నాయ‌కులు ఎంత‌కు తెగించారో అర్థం అవుతోంది. వైసీపీ దాడి నుంచి ప్రాణ‌ర‌క్ష‌ణ‌కు.. పోలీసులే ఇంట్లో దాక్కోవ‌డం.. ఎస్సై గాల్లో కాల్పులు జ‌ర‌ప‌డం.. వైసీపీ గుండాల అరాచ‌కానికి నిద‌ర్శ‌నం. 

కొప్ప‌ర్రు దాడిపై టీడీపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కొప్పర్రులో టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై వైసీపీ గూండాల దాడిని ఖండించారు. 

రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న.. ప్రతి ఒక్కడూ జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయమన్నారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు పనులకు ఆహా.. ఓహో అంటూ కితాబివ్వడం మాని..పోలీసులు శారద కుటుంబ సభ్యులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ డిమాండ్ చేశారు.

Related Segment News