ఏపీలో మహిళా శక్తి పథకం.. ఉచిత బస్సు ప్రయాణానికి నో కండీషన్స్!
posted on Aug 17, 2025 9:08PM
.webp)
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీ మేరకు తోలుగుదేశం ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రంలో ఉచిత బస్సును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం (ఆగస్టు15) సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే. అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకానికి సంబంధించి కొన్ని షరతులు విధించారు. వీటి ప్రకారం ఘాట్ రోడ్లలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సర్వీసులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. ఇక, బస్సులో ప్రయాణించే సమయంలో మహిళలు ఆధార్ సహా.. ఇతర గుర్తింపు కార్డులను ఒరిజినల్‌వే చూపించాలని కూడా పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నిబంధనలతోనే స్త్రీ శక్తి పథకం శుక్రవారం (ఆగస్టు15) సాయంత్రం ప్రారంభమైంది. అ
యితే శనివారం శనివారం ఉదయం నుంచి ఈ పథకాన్ని వినియోగించుకుని పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడానకి ఉత్సాహం చూపారు. కానీ ఆ సమయంలో చాలా మంది ఒరిజినల్ గుర్తింపు కార్డులు లేకుండానే బస్సులు ఎక్కారు. కేవలం జిరాక్సులు, లేదా ఫోన్లలో ఉన్న డిజిటల్ గుర్తింపు కార్డులను చూపించారు. నిబంధనల అనుమతించవంటూ.. వీటిని కండెక్టర్లు అంగీకరించలేదు. దీనితో ఒరిజినల్ గుర్తింపు కార్డు నిబంధనను తొలగించాలని మహిళలు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అలాగే ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లో ఉచితం లేదన్న విషయం తెలియక.. మన్యం, పార్వతీపురం, లోతుగడ్డ, లంబసింగి తదితర ప్రాంతాల్లో గిరిజన మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలన్నీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఐదు రకాల బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి విధించిన నిబంధనలన్నీ దాదాపుగా తొలగించేసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆదివారం ఉదయానికి ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక నుంచీ ఘాట్ రోడ్లలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుంది. అయితే తిరుమల, అన్నవరం ఘాట్ రోడ్ల విషయంలో మాత్రం ఆయా ఆల యాల బోర్డులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇక గుర్తింపు కార్డులు ఒరిజినల్ కండీషన్ ను కూడా ఎత్తివేశారు. జిరాక్స్ కాపీలను అనుమతించాలని ఆదేశించారు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను దాదాపు తీసేసినట్లైంది.