రేపటి నుంచి రాహుల్‌ గాంధీ ఓటు అధికార్‌ యాత్ర

 

లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ  ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు.  ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను వ్యతిరేకిస్తూ  బీహార్‌లోని ససారాంలో యాత్రను రాహుల్ ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర రూట్ మ్యాప్‌ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సభలు, కార్యక్రమాలతో ప్రజల మధ్యకు ప్రతిపక్ష నాయకుడు  రానున్నారు. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ఓటర్ అధికార్ యాత్ర ముగియనుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తో సహా యాత్రలో ఇండియా కూటమి నేతలు, కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలో బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రను చేపట్టారు. 

దేశవ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా తమ యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో  ఓట్ల దొంగతనం జరిగిందంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటర్లను బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఓటర్ల హక్కుల యాత్రను చేపడుతున్నారు. ఆయన ప్రజా కోర్టుకు చేరుకుని, భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలంటే, ఇక్కడి ఓటర్లను బలోపేతం చేయాలని ప్రజలకు చెబుతారు. బీహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణకు వ్యతిరేకంగా, ఓటర్ల చోరీకి వ్యతిరేకంగా పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి యాత్ర జరుగుతోందని కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ తెలిపారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu