నాగోల్‌లో ప్రియుడి ఇంట్లో మహిళ ఆత్మహత్య

 

మానవత్వం తో ఆలోచించి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. అదే అతడు చేసిన పెద్ద తప్పు...ఆ తప్పే  అతని నిందితుడిగా నిలబెట్టింది...నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.మహబూబాబాద్ జిల్లా రెడ్యాల చెందిన ఓ స్వరూప (38) అనే మహిళ కు భర్త, కుమారుడు (3) ఉన్నాడు. జీవ నోపాధి నిమిత్తం ఈ కుటుంబం హైదరాబాద్ నగరానికి వచ్చి నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు . ఆ మహిళ కుటుంబం నివసించే సమీపంలోనే బానోతు అనిల్ నాయక్(24) అనే యువకుడు నివసిస్తున్నాడు. 

ఈనెల 19వ తేదీన కుమారుడిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నారని చెప్పి ఇంట్లో నుండి బయటకు వచ్చిన స్వరూప.... అనిల్ వద్దకు వెళ్ళింది.   ఈనెల 21వ తేదీ వరకు వారిద్దరూ కలిసి ఉన్నారు. 21వ తేదీన అనిల్ కూరగాయలు కొనుగోలు చేయడానికి బయటికి వెళ్లాడు. ఇంతలోనే స్వరూప బాత్రూం వెళ్ళింది. బాత్రూం హ్యాంగర్ కు ఉరివేసుకుంది.. కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అనిల్ కు స్వరూప కనిపించ లేదు. దీంతో అతడు బాత్రూం డోర్ ను గట్టిగా కొట్టాడు. అతి కష్టం మీద బాత్రూం డోర్ ను పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. ఇప్పటికే ఆ మహిళ తుది శ్వాస విడి చింది. ఆమె మర ణించడంతో అతడు భయపడ్డాడు. దీంతో అతని కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని... కత్తితో చేతిని కోసుకున్నాడు. 

ఇంతలోనే స్వరూప కుమారుడు అక్కడికి వచ్చి.. తన తల్లిని పిలుస్తూ గట్టి గట్టిగా ఏడవ సాగాడు. స్వరూప కుమారుడిని చూసి అనిల్ మనసు మార్చుకొని వెంటనే  తన చేతికి రుమాలు కట్టుకొని..  నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం పోలీసులు  అనిల్ నాయక్ తో ఆ మహిళకు ఎటు వంటి సంబంధం ఉంది? ఆసుపత్రికి వెళ్తానని చెప్పి నేరుగా అనిల్ ఇంటికి రావడం ఏమిటి? అనిల్ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి?అనే విషయాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu