ఈ సమస్యలున్న వ్యక్తులు  పెసరపప్పు తింటే డేంజర్..!

 

 


పప్పుధాన్యాలు  ప్రోటీన్ కు మంచి మూలం. చాలా మంది  ప్రోటీన్ కోసం పెసలు,  బొబ్బర్లు,  ఉలవలు వంటివి  ఆహారంలో చేర్చుకుంటారు. పెసరపప్పు కూడా వాటిలో ఒకటి. పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండటం కోసం మొలకెత్తిన పెసలు తినడమే కాకుండా పెసరపప్పును చాలా రకాల వంటకాలు, స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తారు. సాధారణంగా పెసరపప్పు  అన్ని పప్పు ధాన్యాలలోకి  ఆరోగ్యకరమైనవి,  సురక్షితమైనవి.  కానీ  పోషకాలు అధికంగా ఉండే పెసరపప్పు  కూడా  కొందరికి హాని చేస్తుంది. ఏ వ్యక్తులకు పెసరపప్పు హానికరం,  ఎందుకు ? అనే విషయాలు తెలుసుకుంటే..

షుగర్ తక్కువ ఉన్నవారు..

చాలామంది షుగర్ లెవల్ ఎక్కువ అంటుంటారు కానీ.. షుగర్ లెవల్ తక్కువ అని కంప్లైంట్ చేసేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు  పెసరపప్పు  తినకుండా ఉండాలి. ఈ పప్పులో  రక్తంలో చక్కెరను తగ్గించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ ఉండేవారు పెసరపప్పు తింటే చక్కెర స్థాయి మరింత తగ్గి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

అధిక యూరిక్ యాసిడ్ ఉన్న వ్యక్తులు..

 అధిక యూరిక్ యాసిడ్ స్థాయితో ఇబ్బంది పడేవారు ఉంటారు. ఇలాంటి వారు పెసరపప్పు తినకుండా ఉండాలి. ఈ పప్పులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది  అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్నవారికి హానికరం . కాబట్టి, అలాంటి వ్యక్తులు పెసరపప్పును పరిమిత పరిమాణంలో తినడం మంచిది.

కిడ్నీలో రాళ్లు..

మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే పెసరపప్పు  తినడం  మానుకోవాలి . పెసరపప్పులో  ఆక్సలేట్‌లు ఉంటాయి.  ఇవి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. కాబట్టి, మీకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే పెసరపప్పు  తినడం మానుకోవాలి.

గ్యాస్,  ఉబ్బరం సమస్యలు..

పెసరపప్పు  ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో గ్యాస్,  ఉబ్బరం వస్తుంది. ఇంకా, పచ్చి  పెసరపప్పు తింటే వాంతులు, విరేచనాలు,  కడుపు నొప్పికి కారణమవుతాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే  వాటిని సరిగ్గా నమలడం చాలా అవసరం.

*రూపశ్రీ.                            

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu