పైనాపిల్ తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందా?  


పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  అయితే కొన్ని రకాల పండ్లు కొన్ని రకాల సమస్యలకు ఔషధంలా పనిచేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ, నేరేడు డయాబెటిస్ సమస్య నియంత్రణలో ఉంచడంలో ఎలా సహాయపడుతుందో.. బీట్రూట్, క్యారెట్, ఖర్జూరం, దానిమ్మ మొదలైనవి రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి ఎలా సహాయపడతాయో.. అలాగే కొన్ని రకాల పండ్లు కొన్ని సమస్యలకు ప్రత్యేకంగా హెల్ప్ అవుతాయి. అలాంటి పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ సాధారణంగా పసుపు రంగులో,  అద్బుతమైన సువాసనతో పుల్లగా,  తియ్యగా చాలా బాగుంటుంది.  పైనాపిల్ లో ఆల్కహాల్ కంటెంట్ కూడా ఉంటుంది. అయితే పైనాపిల్ పురుషులలో స్పెర్మ్ కౌంట్ ను మెరుగుపరుస్తుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే పైనాపిల్ తింటే పురుషులలో స్పెర్మ్ కౌంట్ మెరుగవుతుందా? తెలుసుకుంటే..

పైనాపిల్ నేరుగా స్పెర్మ్ కౌంట్ ను పెంచదు.. కానీ ఇది పురుషుల సంతానోత్పత్తికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.

పైనాపిల్ లో విటమిన్-సి, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.  ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.  ఆక్సీకరణ ఒత్తిడి ఉంటే శరీరంలో స్పెర్మ్ కణాలు దెబ్బతింటాయి.  అంటే పైనాపిల్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా స్పెర్మ్ కణాలను రక్షిస్తుంది.

విటమిన్-సి స్పెర్మ్ కౌంట్ ను, స్పెర్మ్ చలనంతో పాటు మొత్తం స్పెర్మ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి.  ముఖ్యంగా పైనాపిల్ లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది.  ఇది స్పెర్మ్ చలనాన్ని మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే ఫలదీకరణ ప్రక్రియలో కూడా ఇది సహాయపడుతుంది.

పైనాపిల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల స్పెర్మ్ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడే మగవారికి మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అయితే స్పెర్మ్ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి వైద్య చికిత్సలకు మించిన ప్రత్యామ్నాయంగా పైనాపిల్ ను ఎంపిక చేసుకోవడం అయితే సరైనది కాదని కూడా వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.

                                         *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu