డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే పోషకాలేంటో తెలుసా?

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలే ఉంటాయి కానీ అనారోగ్యానికి కారణమయ్యేది ఏదీ ఉండదు.అందుకే అనారోగ్యం చేసినప్పుడు పండ్లను ఆహారంగా తీసుకుంటే శరీరం చాలా వరకు కోలుకుంటుంది.  ఇకపోతే స్థానిక దేశీ పండ్లు మాత్రమే కాకుండా  ఇప్పట్లో విదేశీ పండ్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మార్కెట్లలో కూడా అన్ని రకాల పండ్లు లభ్యమవుతాయి. వీటిలో డ్రాగన్ ప్రూట్ చాలా ముఖ్యమైనది. తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండే ఈ డ్రాగన్ ప్రూట్ పోషకాలలో కూడా మేటి అని అంటున్నారు ఆహార నిపుణులు.  అవేంటో తెలుసుకుంటే..

డ్రాగన్ ఫ్రూన్ ను పిటాయా అని కూడా పిలుస్తారు.  ఈ రుచికరమైన, పోషకమైన పండు రంగు చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఇక దీని షేప్ కూడా దీనికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇతర పండ్లతో పోలిస్తే పోషకాలలో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఏం తీసిపోదు. డ్రాగన్ ఫ్రూట్ లో అనేక విటమిన్లు, ఖనిజాలు,  పుష్కలంగా ఉంటాయి.

విటమిన్-సి..

డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్-సి చాలా సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం లో సహాయపడుతుంది. సీజనల్ సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

విటమిన్-ఎ..

కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్-ఎ కూడా డ్రాగన్ ప్రూట్ లో సమృద్దిగా ఉంచుంది. విటమిన్-ఎ  కంటి చూపును కాపాడుకోవడానికే కాకుండా రేచీకటి వంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

బి-కాంప్లెక్స్ విటమిన్లు..

డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్లు-బి1,  బి2, బి3 వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఈ విటమిన్లు శరీరంలో శక్తి ఉత్పత్తికి ముఖ్యమైనవి.  ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడతాయి.

కాల్షియం, మెగ్నీషియం..

ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, మెగ్నీషియం చాలా ముఖ్యం.  అలాగే మెగ్నీషియం కండరాల ఆరోగ్యానికి కూడా అవసరం.  ఈ కాల్షియం, మెగ్నీషియం ఖనిజాలు రెండూ డ్రాగన్ ప్రూట్ లో సమృద్దిగా ఉంటాయి.

                              *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu