కవిత విషయంలో స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే?
posted on Sep 8, 2025 4:18PM
.webp)
తన సోదరి కవిత విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీలో చర్చించిన తర్వాతే తమ అధినేత ఆ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తాను మాట్లాడేది ఏమి లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి హారీశ్ రావు స్పందిస్తూ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌రావు, సంతోష్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.
ఈ క్రమంలో ‘‘రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది..’’ అంటూ కవిత పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కూడా తీసుకోలేదు. 103 రోజులుగా కేటీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారామె. అయితే తనకు నోటీసు ఇవ్వడంపై బాధ కలగడం లేదని.. ఈ వ్యవహారంపై తెలంగాణ భవన్‌లో మహిళా బీఆర్‌ఎస్ నేతలు స్పందించడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.