మిథున్ రెడ్డి కి కండీషన్డ్ బెయిలు
posted on Sep 29, 2025 3:23PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఈ కుంభకోణం కేసులో ఏ4న ఉన్న మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసి అనంతరం రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.
కాగా ఆయన దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్ 29) ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. రెండు ష్యూరిటీలు, రూ. 2 లక్షల పూచీకత్తుతో ఆయనకు బెయిలు మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, వారంలో రెండు సార్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ షరతులతో కూడిన బెయిలుపై మిథున్ రెడ్డి మంగళవారం (సెప్టెంబర్ 30) రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.