గీతం యూనివర్సిటీ కరెంటు బకాయిలు రూ.118 కోట్లు...హైకోర్టు సీరియస్

 

సామాన్య ప్రజలు ఒక నెల కరెంట్ బిల్లు కట్టకపోతే మరుసటి నెల అధికారులు ఏకంగా ఇంటికి వచ్చి   రెంట్ కట్ చేస్తామని హెచ్చరించారు. అదే ఓ యూనివర్సిటీ ఏళ్ల తరబడి కరెంటు బిల్లు చెల్లించలేదు. దీంతో కోట్ల రూపాయల బకాయి పడ్డారు. అయినా కూడా అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు కూర్చున్నారు. కొన్ని కోట్ల రూపా యల బకాయి పడడంతో చివరకు అధికారులు తెరుకొని ఆ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేశారు... 

అయ్య బాబోయ్ అన్ని కోట్లు మేము కట్టలేమంటూ ఆ యూని వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. అదే మన గీతం యూనివర్సిటీ....ఏండ్ల తరబడి కరెంటు బిల్లు కట్టని గీతం యూనివర్సిటీకి ఎస్పిడిసిఎల్  నోటీసులు జారీ చేసింది... ఇప్పటివరకు అయినా కరెంట్ బిల్లు బకాయి మొత్తం చెల్లించా లంటూ నోటీసులో పేర్కొన్నారు... నోటీసులను చూసిన గీతం యూనివర్సిటీ యజమాన్యం ఒకేసారి అంత కరెంటు బకాయి చెల్లించ లేమంటూ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

 ఈ కేసును విచారించిన జస్టిస్ నాగేష్, భీమపాక 2008 నుండి గీత యూనివర్సిటీ విద్యుత్ బిల్లులు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు. ఇంత మొత్తం బిల్లులు ఇప్పటివరకు చెల్లించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లు చెల్లించక పోయినా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు.. గీత యూనివర్సిటీ పై 118 కోట్ల కరెంటు బకాయిలు ఉండడాన్ని చూసి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలు వెయ్యి రూపాయలు కూడా చెల్లించకపోతే వెంటనే విద్యుత్ కనెక్షన్ తొలగి స్తున్నామని వారిని హెచ్చరిస్తారు.. 

మరి ఇన్ని కోట్ల కరెంటు బకాయిలు ఉన్నా కూడా మీరెందుకు గీత యూనివర్సిటీ కి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని హైకోర్టు ఆగ్రహించింది... చట్టం అందరికీ సమాన మేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో హాజరై వివరణ ఇవ్వాలని ఎస్ పి డి సి ఎల్ సూపరింటిండింగ్ ఇంజనీర్ ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu