ఎన్ ఐ ఏ దాడుల్లో  2047 డాక్యుమెంట్  ల‌భ్యం

ఇటీవ‌ల ఎన్ఐఏ సోదాల్లో పిఎఫ్ఐ కి సంబంధించిన బాంబుల త‌యారీ, మిష‌న్ 2047 ప‌త్రాలు ల‌భ్య‌మ‌ య్యాయ‌ని ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారులు తెలిపారు. అయితే పి ఎఫ్ ఐ పై కేంద్రం నిషేధాజ్ఞ‌లు జారీ చేయ‌డం ప్ర‌జాస్వామ్యానికి, రాజ్యాంగంలో పేర్కొన్న పౌర‌హ‌క్కుల‌కు విఘాతం క‌లిగించ‌డ‌మేన‌ని పి ఎఫ్ ఐకి చెందిన సోష‌ల డ‌మోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా పేర్కొన్న‌ది. 

కానీ దేశంలో ఎన్ ఐ ఏ చేప‌ట్టిన దాడుల్లో అనేక ప్రాంతాల్లో తీవ్ర‌వాదులతో పి ఎప్ ఐకి  సంబంధాలు ఉన్నట్టుగా రుజువు చేయ‌గ‌ల ప‌త్రాలు ల‌భించాయ‌ని అధికారులు తెలిపారు. ముప్ప‌య్యేళ్ల క్రితం స్థాపిం చిన పి ఎఫ్ ఐ దేశంలో యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు వారికి తీవ్ర‌వాద శిక్ష‌ణ‌ను కూడా ఇస్తోంద‌ని, వారిని దేశంలో అశాంతి ప్రేరేపించేందుకు ఉప‌యోగించుకోవ‌డానికి సిద్ధ‌ప‌రుస్తోంద‌న్నది దాడుల్లో వెల్ల‌డ‌యిందని ఎన్ ఐఏ అధికారులు తెలిపారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కూ దేశం మొత్తం మీద 300 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలిపారు. 

దేశంలో చాలా ప్రాంతాల్లో జ‌రిగిన దాడుల స‌మాచారాన్ని ప‌రిశీలించిన త‌ర్వాత‌నే ఈ సంస్థ వాస్త‌వ కార్య క‌లాపాలు మ‌రింత తెలిశాయ‌ని, అందువ‌ల్ల‌నే సంస్థ‌పై నిషేధ నిర్ణ‌యం తీసుకున్నట్టు అధికారులు తెలి పారు. దేశంలో త్వ‌ర‌లో భారీ బాంబు దాడుల‌కు ఈ సంస్థ శిక్ష‌ణ‌లో ఉన్న‌వారు సిద్ధ‌మ‌యిన స‌మా చారం అందిన మీద‌ట‌నే దాడులు చేప‌ట్టారు. ముఖ్యంగా పి ఎఫ్ ఐ నాయ‌కుడు మొహ‌మ్మ‌ద్ న‌దీమ్ ను ఉత్త‌ర ప్ర‌దేశ్ బారాబంకీలో ప‌ట్టుకుని అత‌ని వద్ద ల‌భించిన కీల‌క ప‌త్రాలతో  దేశంలో దాడుల‌కు సిద్ధ ప‌డిన సంగ‌తి వాస్త‌వ‌మేన‌ని తేలింది. ఐఇడి ఎలా త‌యారు చేయాలి, ఎలా ఉప‌యోగించాల‌నే అంశా లపై ప్ర‌త్యేక  శిక్ష‌ణ గురించిన డాక్యుమెంట్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పి ఎఫ్ ఐ నాయ‌కుడు ఖాద్రా వ‌ద్ద ల‌భించా య‌ని అధికారులు తెలిపారు. 

ఇదిలా ఉండ‌గా, దేశంలో ప్ర‌జార‌క్ష‌ణ ప‌ట్ల కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందని విప‌క్షాలు విరుచుకు ప‌డుతున్నాయి. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటం, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం, అధికార కాంక్ష త‌ప్ప బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం, ర‌క్ష‌ణ గురించి నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నాయి. ఎన్ ఐ ఏ దాడులతో దేశం లో అనేక ప్రాంతాల్లో సంఘ‌విద్రోహ‌శ‌క్తులు బ‌లోపేతం అవుతున్నార‌న్న‌ది వెలుగులోకి వ‌చ్చింది. కానీ వారికి విదేశాల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం, దేశంలో దాడుల‌కు పాల్ప‌డేందుకు సిద్ధ‌ప‌ డ‌టం చివ‌రి నిమిషంలోనే అవి బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల ప్ర‌జ‌లు ఎంతో ఆందోళ‌న‌ప‌డుతున్నారు.
 
ఇదిలా ఉండ‌గా, దేశంలో త‌మ సంస్థ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దాడులు చేప‌ట్ట‌డం ఒక డ్రామాగా పి ఎఫ్ ఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. తీవ్ర‌వాద వ్య‌తిరేక కేసుల‌ను ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకునే ఎన్ ఐఏ, ఆర్దిక నేరాల సంబంధించి ప‌నిచేసే ఈడీ రెండు కీల‌క సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టు కుంద‌ని ఆరోపించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu