దేనికైనా రెడీ పై మోహన్ బాబు సారీ చెప్పాలి: ఎమ్మెల్యేలు

బ్రాహ్మణులపై నటుడు మోహన్‌బాబు అనుచరులు చేసిన దాడికి నిరసన తెలుపుతూ గురువారం

manchu vishnu, Denikaina Ready manchu vishnu, Denikaina Ready issue, Denikaina ready controversy

 

బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం మోహన్‌బాబు ఇంటిముందు నిరసన తెలపగా వారిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.  అంతకు ముందు బ్రాహ్మణులే ఇంటిపై దాడి చేశారని విష్ణువర్థన్‌బాబు పేర్కొన్నారు.


కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు మోహన్ బాబు పైన మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బ్రాహ్మణులపై మోహన్ బాబు గార్డ్సు రౌడీయిజం చేయడం దురదృష్టకరమన్నారు. సినిమాలో ఉన్న అభ్యంతరకర సీన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులపై దాడి చేసినందుకు మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu