ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు కన్నుమూత
posted on Oct 20, 2025 11:27AM

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటని తెలిపారు. కావలి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి సుబ్బనాయుడు ఎంతో కృషి చేశారన్నారు.
నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకుడిని కోల్పోయామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుబ్బనాయుడు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సుబ్బనాయుడు మృతిపట్ల మంత్రులు నారా లోకేశ్, నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి తీరని లోటు అని పేర్కొన్నారు. దగదర్తిలో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.