తిరుమలలో భక్తుల రద్దీ... ఆర్జిత సేవలు రద్దు
posted on Oct 20, 2025 11:09AM

దీపావళి పండుగ వేళ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్మనానికి 18 గంటలు వరకు సమయం పడుతోంది. ఇదిలా ఉంటే ఆదివారం స్వామి వారిని 84,017 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 30,097 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.97కోట్లు అని టీటీడీ స్పష్టం చేసింది. మరోవైపు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.