లండన్‌ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి

 

కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాది స్తాడని కలలు కన్నా ఓ తల్లిదండ్రులకు విధి విషాదం మిగిల్చింది. లండన్ లో చదువుకోవ డానికి వెళ్లిన తన కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్లిపో యడాని తెలియ గానే ఆ తల్లిదం డ్రులు  దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లాలోని వేమూరు గ్రామానికి చెందిన రాపోలు రవీందర్ తన కుటుంబ సభ్యుల తో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చి...మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృత కాలనీ లో ఉన్న శ్రీసాయి రెసిడెన్సీ లో నివా సం ఉంటూ... ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొన సాగిస్తున్నారు. 

రాపోలు రవీందర్ కుమారుడు రాపోలు రిషితేజ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. కేవలం నాలుగు నెలల క్రితం అనగా మే 9వ తేదీన రిషి తేజ్ ఎంబీఏ చదువుకో వడం కోసం లండన్ కి వెళ్ళాడు. ఈస్ట్ లండన్ లోని బీచ్ లో సన్ రైజ్ చూడడం కోసం 2 కార్లు లలో 9 మంది స్నేహితులతో కలిసి  వెళ్తుండగా... ఒక వాహనం అత్యంత వేగంగా వచ్చి వీరి కారును ఢీ కొట్టింది. ఇద్దరు అక్కడి కక్కడే మృతిచెంద గా పలువురికి  గాయాలయ్యాయి.

డ్రైవర్ లు సేఫ్ గా ఉన్నారని తెలి పారు. రిషితేజ్ హైదరాబాద్ లో BBA పూర్తి చేసి దిల్ రాజు కు సంబంధించిన  మ్యగో ఛానెల్ లో కొద్దికాలం ఉద్యోగం చేశాడని....పై చదువుల కోసం ఈస్టర్న్ లండన్ యూనివర్సిటీ లో ఎంబీఏ చేయడం కోసం లండన్ వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu