అభిమాన హీరోకి 75 కోట్ల రూపాయిల వీలునామా రాసిన అభిమాని
on Jul 28, 2025

భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'సంజయ్ దత్'(Sanjay Dutt). ప్రస్తుతం 'గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna),బోయపాటి శ్రీను(Boypati Srinu)కాంబోలో తెరకెక్కుతున్న 'అఖండ 2'(Akhanda 2)తో పాటు, పాన్ ఇండియా రెబల్ స్టార్ 'ప్రభాస్'(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab)లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో భూట్నీ, హౌస్ ఫుల్ 5 వంటి చిత్రాలతో అలరించడం జరిగింది.
సంజయ్ దత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు '2018 లో 'నిషా పాటిల్'(Nisha Paatil)అనే లేడీ అభిమాని డెబ్భై రెండు కోట్ల రూపాయిల విలువైన ఆస్తిని నా పేరుపై రాసింది. మొదట ఈ విషయం తెలిసినప్పుడు ఎంతో షాక్ కి గురయ్యాను. వెంటనే లాయర్లుని సంప్రదించి నాపేరుపై రాసిన ఆస్తిని నిషా పాటిల్ కుటుంబానికి వచ్చేలా చేశాను. ఆమె నాపై చూపిన ప్రేమ, విశ్వాసం చాలా గొప్పది. కానీ ఆస్థిపై ఆమె కుటుంబ సభ్యులకే హక్కు ఉందని చెప్పుకొచ్చాడు. ముంబై లోని మలబార్ హిల్స్ లో నివసించే 62 సంవత్సరాల 'నిషా పాటిల్ కి సంజయ్ దత్ అంటే ఎంతో అభిమానం. అనారోగ్యం బారిన పడటంతో, తన తదనంతరం డెబ్భై రెండు కోట్ల విలువైన ఆస్థి సంజయ దత్ కి చెందాలని ఏకంగా బ్యాంకుకి వీలునామా రాసింది. ఆమె మరణించిన తర్వాతే వీలునామా విషయం బయటపడింది.
బాలీవుడ్ ప్రముఖ హీరో, 'సునీల్ దత్'(Sunil Dutt)నట వారసుడిగా 1981 లో సినీ రంగ ప్రవేశం చేసిన 'సంజయ్ దత్' అనతికాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. రొమాంటిక్ అండ్ యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ పొందిన సంజయ్ దత్,1993 వ సంవత్సరంలో అక్రమ ఆయుధాన్ని కలిగి ఉన్నాడన్న కేసులో 'టాడా' చట్టం కింద ఐదు సంవత్సరాలు జైలుశిక్ష కూడా అనుభవించాడు. తల్లి 'నర్గిస్'(Nargis dutt)పేరెన్నికగన్న నటి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



